వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి కూడా శాశ్వత అధ్యక్షులు, సభ్యులు ఉండరని తెలిపింది. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి తీర్మానాన్ని జగన్ అప్పుడే తిరస్కరించారని చెప్పారు. జగన్ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్ లోకి ఎక్కలేదని తెలిపారు. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని... ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని అన్నారు.
జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై వివరణ ఇవ్వాలని వైసీపీకి ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఐదేళ్ల వరకు జగన్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని... ఆ తర్వాత పార్టీలో ఎన్నిక జరుగుతుందని చెప్పారు. #ysrcp #ysjagan
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) September 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)