Nara Lokesh: శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేష్, ఈక్వెనెక్స్ డేటా సెంటర్ కేంద్ర కార్యాలయం సందర్శన, పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం

శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు లోకేష్. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు లోకేష్‌.

AP Minister Nara Lokesh America Tour Latest Updates(Nara Lokesh X)

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు లోకేష్.

ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండి కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లోకేష్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డాటాసెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను వివరించి ఈక్వెనెక్స్ ఏపీకి రావాలని ఆహ్వానించారు లోకేష్‌. శాన్‌ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వినతి, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి

Here's Tweet:

అనంతరం భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీలో మంచి ఎకో సిస్టం ప్రస్తుతం ఉందని, అమెరికాలోని వివిధరంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు.