Vangalapudi Anitha On Pawan Kalyan: ఏపీలో బాలికపై దారుణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు స్పందించిన హోంమంత్రి అనిత, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం

నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.

AP Minister Vangalapudi Anitha responds on Pawan Kalyan Tweet(X)

Hyd, Nov 9:  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.

దీనిని రీ ట్వీట్ చేస్తూ ప్రశ్నించారు పవన్. నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరారు. నేరాలపై అందరూ భయపడకుండా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎక్స్ వేదికగా కోరారు.

పవన్ చేసిన ట్వీట్‌పై స్పందించారు హోంమంత్రి అనిత. పవన్ కల్యాణ్‌తో పాటు హోంమంత్రిగా నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు. నెల్లూరులో జరిగిన దారుణ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని.... నెల్లూరు ఎస్పీతో నేరుగా మాట్లాడాను.. విచారణ జరుగుతోందని తెలిపారు.

Here's Tweet:

ఇలాంటి దారుణమైన చర్యలను సహించేది లేదు అన్నారు. ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు.