AP MLC Election Result 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ, మూడుస్థానాల్లోనూ విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధులు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్‌లో ఉత్కంఠ, రీ కౌంటింగ్ పట్టుబట్టిన వైసీపీ
వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి (Bhumi Reddy Ram Gopal Reddy) గెలుపొందారు.
Vijayawada, March 18: శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు (MLC seats) జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుభీ మోగించింది. మూడో స్థానంలో కూడా టీడీపీ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ (కడప – అనంతపురము – కర్నూలు) (Rayalaseema East Graduate Constituency Election) ఎమ్మెల్సీగా.. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7543 ఓట్ల మెజారీటీతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి (Bhumi Reddy Ram Gopal Reddy) గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ రాకపోవడంతో, అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 7543 ఓట్ల తేడాతో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. ఈ కౌంటింగ్ లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా, వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయని తెలిపారు. అధికారికంగా ఎన్నికల కమిషన్ అనుమతి పొందిన అనంతరం భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు.
మరోవైపు రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC election of Uttarandhra graduates)ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు (TDP candidate Vepada Chirajeevi Rao) విజయదుందుభి మోగించారు. దీంతో మొత్తం మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
రాయలసీమ జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రాజకీయంగా తమకు బలమైన కోటలుగా వైసీపీ నాయకత్వం భావిస్తూ వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఎదురు గాలి వీచినా రాయలసీమలో మాత్రం తమకు తిరుగుండదని ఇంతకాలం ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటూ వచ్చారు. పట్టభద్ర ఎన్నికలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఉన్న రాయలసీమ తూర్పు పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.