పేపర్ లీకేజీపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో శనివారం ప్రగతి భవన్‌లో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణితో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు హరీశ్‌రావు, కెటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై న్యాయమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు రాజధానిలో నిరసనలు చేపట్టాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నివేదికను అనుసరించి, గ్రూప్ 1 ప్రిలిమినరీ, DAO మరియు AEE పరీక్షలను TSPSC శుక్రవారం రద్దు చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11న తిరిగి నిర్వహించబడుతుంది. ఇతర పరీక్షల రీషెడ్యూల్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ పేర్కొంది.
ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం : మంత్రి శ్రీ @KTRBRS. pic.twitter.com/jkQN5EKB5G
— BRS Party (@BRSparty) March 18, 2023
అనంతరం టీఎస్‌పీఎస్‌సి పేపర్ లీకేజీపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమీక్షించామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో ఉమ్మడిగా ఎపిపిఎస్సీపై ఆరోపణలు వచ్చేవని మంత్రి తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరే కాదు. తెరవెనుక ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులెవరూ మళ్లీ ఫీజు కట్టాల్సిన పనిలేదన్నారు. సాధ్యమైనంత వేగంగా పరీక్షలు నిర్వహిస్తాన్నారు. గతంలో అప్లయ్ చేసినవాళ్లంతా అర్హులేనని మంత్రి కెటిఆర్ వివరించారు.