AP MLC Election Result: ఆగని జగన్ దూకుడు, 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం, గోదావరి జిల్లాల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ

ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది.

Amaravati, Mar 16: మార్చి13న ఎన్నికలు జరిగిన 9 ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు గురువారం ప్రారంభమైంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజ­క­వర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. బలం లేకపోయినా పోటీలో నిలిచి టీడీపీ భంగపడింది.

పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు.కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1088 మందిస్థానిక ప్రజాప్రతినిధులు ఓటు వేశారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది.

ఏపీ ప్రజలకు వడగాలుల హెచ్చరిక, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు

వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌రావు విజయం సాధించారు. ఇక శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు.ఈ ఎన్నికలో మొత్తం 752మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు వేయగా.. రామారావుకు 632 ఓట్లువచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు రాగా.. 12 ఓట్లు చెల్లలేదు.

ఏపీలో మార్చి 16 నుంచి భారీ వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు 48 గంటలు పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఆరు జిల్లాల్లో కలిపి 2లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. 2007, 2011, 2017లలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ రెండో ప్రాధాన్య ఓటుతోనే అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా ఆ ఓటే కీలకం కానుందని సమాచారం.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..