Y. V. Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డి, కార్పొరేషన్, చైర్మన్ పదవులు పొందేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వని ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ కోసం కష్టపడుతున్న వారికే అధిక ప్రాధాన్యత
V. Subba Reddy) మరోసారి నియమితుయ్యారు. టీటీడీ ఛైర్మన్ గా ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే టీటీడీ ఛైర్మన్ గా (TTD Chairman) ఉండటం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో, ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారాలని అనుకుంటున్నానని ఇటీవల సుబ్బారెడ్డి ప్రకటించారు.
Amaravati, July 17: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy) మరోసారి నియమితుయ్యారు. టీటీడీ ఛైర్మన్ గా ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. అయితే టీటీడీ ఛైర్మన్ గా (TTD Chairman) ఉండటం వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో, ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారాలని అనుకుంటున్నానని ఇటీవల సుబ్బారెడ్డి ప్రకటించారు.
ఇదే విషయాన్ని జగన్ కు కూడా చెప్పానని తెలిపారు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని చెప్పారు. దీంతో, ఆయనకు కీలక బాధ్యతలు దక్కబోతున్నాయని అందరూ భావించారు. అయితే టీటీడీ చైర్మన్‌గా ఆయన్ను తిరిగి కొనసాగిస్తున్నట్లు ( YV Subba Reddy Re appointed As TTD Chairman) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
శుక్రవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన.. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. కాగా 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటును వైవీ సుబ్బారెడ్డి అతి కష్టం మీద వదులుకోవాల్సి వచ్చింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి లోక్ సభ సీటును ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అనంతరం టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డికి జగన్ అవకాశం కల్పించారు. మరో రెండున్నరేళ్లు ఆయన టీటీడీ ఛైర్మన్ గా కొనసాగనున్నారు.
ఈయితే ఈ సారి ఎపి నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యేలకు కార్పొరేషన్, చైర్మన్ పదవులు పొందేందుకు జగన్ అవకాశం ఇవ్వలేదు. పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి కార్పోరేషన్ చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. . గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మొదటి ప్రాధాన్యత , ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి రెండో ప్రాధాన్యత కింద అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో 17 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 మందికి అవకాశం కల్పించారు. కడప జిల్లాలో 11 మందికి, విశాఖలో 10 మందికి అవకాశం కల్పించారు.
జిల్లాల వారీగా నామినేషన్ పోస్టులు వివరాలు
విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు
పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు
అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
కడప జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు