Andhra Pradesh: నకిలీ బంగారం దందా గుట్టు రట్టు,రెండు ముఠాలను పట్టుకున్న పోలీసులు.. 10 మంది అరెస్టు
అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. 10 మందిని అరెస్టు చేశారు.
Vij, Oct 26: రెండు ముఠాల మధ్య తుపాకీ కాల్పుల మిస్టరీని చేధించారు సత్యసాయి జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా కదిరి జాతీయ రహదారిపై రామాపురం కూడలి వద్ద రెండు ముఠాల మధ్య కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసు టీమ్‌లు.. 10 మందిని అరెస్టు చేశారు.
బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని అంటగడుతూ ప్రజలను మోసం చేస్తోంది షికారిపాలెం ముఠా. ఈ క్రమంలో తెలంగాణలోని జనగామ జిల్లా, మానసాన్ పల్లికి చెందిన నరేశ్ ను సంప్రదించి రూ.15 లక్షలకు నకిలి బంగారాన్ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ముఠా.
నకిలీ బంగారం వ్యవహారం ముందుగానే గ్రహించి హైదరాబాద్‌కు చెందిన పులి అరవింద్ కుమార్ ను సంప్రదించారు నరేశ్. దీంతో నకిలీ బంగారం ముఠా గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లాన్ రెడీ చేశారు అరవింద్. ఈనెల 20న రామపురం గ్రామం బతలపల్లి పీఎస్ సమీపంలో సమావేశమయయాయి రెండు ముఠాలు. విశాఖ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌లో నాగుపాము హల్‌చల్, పామును చూసి హడలిపోయిన చిన్నారులు...వీడియో ఇదిగో
ఆ సమయంలో ఇరు గ్రూపుల మధ్య ఘర్షణ జరగడంతో డమ్మీ తుపాకీతో కాల్పులు జరిపారు అరవింద్ సహాయకులు. దీంతో అక్కడి నుంచి రెండు గ్రూపులు పరారుకాగా రంగంలోకి దిగి రెండు ముఠాలకు చెందిన 10 మందిని అరెస్టు చేశారు పోలీసులు.