AP Police Bagged 125 Awards: దేశంలోనే ఉత్తమ డీజీపీగా గౌతం సవాంగ్, 125 జాతీయ అవార్డులను దక్కించుకున్న ఏపీ పోలీసులు, ఈ ఏడాదే 17 అవార్డులు కైవసం, పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ప్రశంసించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు (స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బీ–నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో/కేంద్ర హోంశాఖ) గుర్తించి అవార్డులను ప్రకటించాయి. అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. అంతేకాక.. ఏపీ పోలీసు శాఖ మొత్తం 125 జాతీయ అవార్డులను (AP Police Bagged 125 Awards) దక్కించుకోగా, ఈ ఏడాదే 17 అవార్డులను అందుకుంది.

Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, Mar 22: ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు (స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బీ–నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో/కేంద్ర హోంశాఖ) గుర్తించి అవార్డులను ప్రకటించాయి. అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. అంతేకాక.. ఏపీ పోలీసు శాఖ మొత్తం 125 జాతీయ అవార్డులను (AP Police Bagged 125 Awards) దక్కించుకోగా, ఈ ఏడాదే 17 అవార్డులను అందుకుంది.

దేశంలోనే ఉత్తమ డీజీపీ అవార్డు కూడా రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌కే దక్కింది. స్మార్ట్‌ ఇన్నోవేటివ్‌ పోలీసింగ్‌ స్టేట్‌, ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దిశా పోలీస్‌స్టేషన్లు , మహిళలకు హెల్ప్‌ డెస్క్‌, సైబర్‌ మిత్ర, కోర్ట్‌ బ్లేజ్‌, ఉత్తమ డీజీపీ అవార్డు, దేవాలయాల పరిరక్షణ, సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టం, ప్రజల భద్రతకు పూర్తి భరోసా వంటి వాటిల్లో ఏపీ పోలీసులు అవార్డులు (AP Police Department Wins 125 National Awards) సాధించారు.

AP పోలీసులు కేవలం 14 నెలల్లో కొన్ని జాతీయ అవార్డులతో సహా 125 అవార్డులను పొందారు మరియు ఇతర రాష్ట్రాల సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. "సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, మేము తప్పిపోయిన 11,440 మందిని, 980 మంది నేరస్థులను మరియు 8.3 లక్షల మంది నేరస్థుల కదలికలను గుర్తించాము, 38 మంది మృతదేహాలను గుర్తించాము" అని డిజిపి (Director General of Police (DGP) D. Gautam Sawang) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్సార్‌ బీమా పథకంపై ఏపీ సీఎం కీలక నిర్ణయం, పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేని వారికి కూడా వైఎస్సార్‌ బీమా వర్తింపు, రూ.258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపిన సెర్ప్‌

దేశంలో మొట్టమొదటిసారిగా, 85% కేసులలో సేట్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేసారు మరియు శిక్షార్హత రేటును పెంచారు. “ఎపి పోలీస్ సేవా యాప్, దిశా మొబైల్ యాప్, సైబర్ మిత్రా యాప్ మరియు ఇతర అనువర్తనాలకు స్పందన అధికంగా ఉంది. 87 ఫీచర్లు కలిగిన ఎపి పోలీస్ సేవా యాప్ ప్రపంచంలో ఇదే మొదటిది. దిశా యాప్‌ను సుమారు 13 లక్షల మంది మహిళలు డౌన్‌లోడ్ చేసుకున్నారు మరియు దిశా పోలీస్ స్టేషన్లలో కేవలం 1,551 చార్జిషీట్లు దాఖలు చేయబడ్డాయి ”అని సవాంగ్ చెప్పారు.

Here's AP CMO Tweet

సైబర్ మిత్రా ద్వారా 3,082 ఫిర్యాదులు వచ్చాయి, వీటిలో 395 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముప్పై ఏడు శాతం ఈ యాప్ నుంచి వచ్చినవని డిజిపి తెలిపారు. ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసిజెఎస్), లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్), ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు మరియు ఇతర వ్యవస్థలు దేశంలో అగ్రస్థానంలో నిలిచాయని డీజీపీ సవాంగ్ అన్నారు మరియు పతకాలు సాధించిన అధికారులను ప్రశంసించారు.

మరోసారి హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్, దీనిపై దర్యాప్తు జరిపేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని పిటిషన్

అవార్లుల వివరాలు ఇవే:

స్మార్ట్‌ ఇన్నోవేటివ్‌ పోలీసింగ్‌ స్టేట్‌

ఆపత్కాలంలో పౌరులకు అందించే సేవలలో ఏపీ పోలీస్‌ శాఖకు అనుబంధంగా ఉన్న అన్ని విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఫిక్కీ) ఈ అవార్డును ప్రకటించింది. పోలీసుల సామర్థ్యం పెంచేందుకు పూర్తిగా డిజిటలైజ్‌ చేయడంలో అత్యంత ప్రతిభ కనపరిచినందుకు రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు దక్కింది.

ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

దేశంలోనే తొలిసారిగా అత్యంత వేగంగా 85శాతం కేసుల దర్యాప్తును పూర్తిచేసినందుకు ఈ అవార్డును గెలుచుకుంది. కేసుల దర్యాప్తులో సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించడంలో ఏపీ పోలీసులు అద్భుత పనితీరు కనబరిచారు. అలాగే, ఎలాంటి రుసుము లేకుండా 87 సేవలతో కూడిన ఏపీ పోలీస్‌ సేవ అప్లికేషన్‌ను పౌరులకు అందుబాటులో ఉంచింది.

దిశా పోలీస్‌స్టేషన్లు

మహిళలకు సత్వర న్యాయం అందించడంతో పాటు కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేయడమే కాక.. సంవత్సర కాల వ్యవధిలోనే 1,551 కేసులలో సత్వర చార్జిషీట్లు దాఖలు చేశారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలోని 13లక్షల మంది మహిళలు దిశ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ‘దిశ’ కేసుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు, ప్రతి జిల్లాలో స్పెషల్‌ కోర్టులను ఏర్పాటుచేయడంతో జాతీయ స్థాయి అవార్డు లభించింది.

మహిళలకు హెల్ప్‌ డెస్క్‌

దిశ పోలీస్‌స్టేషన్లలో ‘ఉమెన్‌ హెల్ప్‌ డెస్‌్క’లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇక్కడ మంచినీటి సౌకర్యం, విశ్రాంతి గది, విశాలమైన రిసెప్షన్‌ సెంటర్, నిరక్షరాస్యులైన మహిళల కోసం ఫిర్యాదు రాయడానికి సిబ్బందిని నియమించారు. అదనంగా మహిళా మిత్ర వలంటీర్లు కూడా తమ సేవలను అందిస్తారు. వీటికి గుర్తింపుగా జాతీయ స్థాయి సిల్వర్‌ అవార్డు వచ్చింది.

సైబర్‌ మిత్ర

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంతర్జాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రవేశపెట్టిన సైబర్‌ మిత్ర (వాట్సాప్‌ నంబర్‌ 9121211100) సత్ఫలితాలనిస్తోంది. ఈ కేసుల సత్వర పరిష్కారానికి గాను జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

కోర్ట్‌ బ్లేజ్‌

కోర్టు బ్లేజ్‌ అనే అప్లికేషన్‌ ద్వారా సామాన్య ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేసుల దర్యాప్తు, సంబంధిత అధికారి వివరాలు, ఆయన పనితీరు గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందిస్తుంది. ఈ అప్లికేషన్‌ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. స్కోచ్‌ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఇది సిల్వర్‌ అవార్డ్‌ దక్కించుకోగా, మరో జాతీయ సంస్థ ఫిక్కీ ప్రకటించిన అవార్డునూ సొంతం చేసుకుంది.

ఉత్తమ డీజీపీ అవార్డు

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రాష్ట్ర పౌరులకి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నందుకు దేశంలో ఉత్తమ డీజీపీగా సవాంగ్‌కు ఈ అవార్డు ప్రకటించారు. పోలీసు శాఖలో పరివర్తనతో కూడిన మార్పునకు కారణమైన నాయకుడిగా ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. సవాంగ్‌ అత్యున్నత నాయకత్వ లక్షణాలు కనబరుస్తున్నారని ప్రశంసించారు.

దేవాలయాల పరిరక్షణ

దేశంలో ఆలయాల పరిరక్షణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని విధంగా ఏపీ పోలీసు విభాగం అనేక రక్షణ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా కమిటీలను నియమించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్‌తో పాటు సెక్యూరిటి ఆడిట్‌ చేయటం ద్వారా దేవాలయాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తోంది. ఇందుకుగాను జాతీయ స్థాయి అవార్డు లభించింది.

సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టం

మానవ హక్కుల పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో సెంట్రల్‌ లాకప్‌ మానిటరింగ్‌ సిస్టం కోసం పైలెట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 500 పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేశారు. వీటిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటిని పోలీస్‌ ప్రధాన కార్యాలయంతో అనుసంధానించినందుకుగాను గోల్డ్‌ అవార్డు లభించింది. ఐసీజేఎస్‌ (ఇంటర్‌ ఆపరెబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌): పౌరులకు పారదర్శకంగా సత్వర న్యాయాన్ని అందించే దిశగా ఇంటర్‌ ఆపరెబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టంను కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసింది. దేశంలో రూల్‌ ఆఫ్‌ లా అమలులో ఇది అత్యంత కీలకం. ఈ విధానంలో పౌరులకు ఉత్తమమైన సేవలు అందిస్తున్న ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుందని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది

సీఎం జగన్ పోలీస్ శాఖను అభినందించారు.  మహిళలు, చిన్నారులు, వెనుకబడిన వర్గాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర పోలీసు శాఖ భరోసా కల్పిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి, సిబ్బందిలోని జబాబుదారీతనాన్ని పెంపొందిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించడమే కాక దాని ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరేలా కృషిచేస్తున్న ఏపీ పోలీసు శాఖకు అభినందనలు తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మన పోలీసు శాఖ దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇప్పటికే 14 నెలల కాలంలో జాతీయ స్థాయిలో 125 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాది 17 జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుంది. ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. ఈ సంధర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సవాంగ్ అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now