COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 491 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,452కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 100 దాటిన కరోనా మరణాలు

గత 24 గంటల్లో కొత్తగా మరో 294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,452 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి...

Sample Testing (Photo Credits: PTI)

Amaravathi, June 20:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,452 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,620 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 22,371 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్తగా మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు, కర్నూల్ నుంచి ఇద్దరు మరియు గుంటూరులో ఒకరు చొప్పున  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 101 కు పెరిగింది.

AP COVID19 Report: 

status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 138 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 3203 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 3316 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif