AP COVID Status: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు, 102 డిశ్చార్జిలు నమోదు, రాష్ట్రంలో 3 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి
అధికారిక గణాంకాల ప్రకారం నిన్నటివరకు ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,99,649గా ఉంది.....
Amaravati, February 8: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకా తీసుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం నిన్నటివరకు ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,99,649గా ఉంది. చాలా మంది టీకా పట్ల నిరాసక్తత కనబరుస్తుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ కోవిడ్ టీకా పట్ల అవగాహన కల్పిస్తోంది. టీకా సురక్షితమైనదని, ఎలాంటి సందేహాలు లేకుండా వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ముందుకు రావాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,094 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 62 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,88,485కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,85,590గా ఉంది. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
గడిచిన ఒక్కరోజులో విశాఖపట్నం జిల్లాలో మరొక కోవిడ్ మరణం సంభవించింది, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7160కి పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 102 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,80,363 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 962 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.