Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Amaravati, Mar 16: భార్యను హత్య చేసి కొండల్లోని లోయల్లో పడేసి పరారైన దుర్మార్గపు భర్త ఎట్టకేలకు (AP Shcoker) అరెస్టయ్యాడు. రామభద్రపురం రావివలస పంచాయతీ (Raviwalasa panchayat) పరిధిలోని మూలసెగాం గ్రామానికి చెందిన ఎన్నికల ఎర్రమ్మ (30)ను భర్త పెంటయ్య గత నెలలో హత్య చేసి కొండల్లో లోయలో పడేసి పరారయిన సంగతి విదితమే. ఈ కేసును పోలీసులు చేధించారు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలు ప్రకారం... భార్యను హత్య చేసిన పెంటయ్య ఫిబ్రవరి 23న పాచిపెంట మండలం కొండతాడూరులోని అతని చెల్లి ఇంటికి వెళదామని మాయమాటలు చెప్పి భార్యను బయలు దేరించాడు. మార్గమధ్యలో పాచిపెంట మండలం శీతం గ్రామం వద్దకు రాగానే ఇద్దరూ గొడవ పడ్డారు. కోపంతో ఎర్రమ్మను బాగా కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఆమెను పొలిమేరల్లో ఉన్న దూరపు బంధువైన వి.సోమయ్య ఇంటికి తీసుకెళ్లాడు.

నేను చచ్చిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్, పిల్లలను బాగా చూసుకోమంటూ..ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు, సూర్యాపేట జిల్లా కోదాడలో విషాద ఘటన

వారింట్లో గత నెల 24,25 తేదీల్లో ఉన్నారు. అయినప్పటికీ భార్య సరిగా కోలుకోలేదు. కోలుకున్న తరువాత కొట్టిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో ఎక్కడ చెబుతుందోనన్న భయంతో 26వ తేదీన పీక నులిమి చంపేశాడు. అనంతరం మృత దేహాన్ని సోమయ్య సహాయంతో భర్త పెంటయ్య కట్టిన డోలీలో పెదసెలగాం పరిసరాల్లో దిబ్బగుడ్డి వద్ద కొండ లోయల్లో పడేసి పరారయ్యారు. పరారైన వారిని ఎట్టకేలకు సోమవారం అదుపులోకి తీసుకొని సీఐ అప్పలనాయుడు, ఎస్‌.కృష్ణమూర్తిలు సాలూరు కోర్టుకు తీసుకువెళ్లారు.



సంబంధిత వార్తలు

Karnataka Horror: కర్ణాటకలో ఘోరం, రాత్రి భోజనం పెట్టలేదని భార్య తల నరికిన భర్త, అంతటితో ఆగకుండా చర్మాన్ని ఒలిచి మృతదేహాన్ని ముక్కలు చేసిన కసాయి

Prajwal Revanna Sex Videos Case: మలుపులు తిరుగుతున్న ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు, 6 రోజుల సిట్ కస్టడీకి హసన్ ఎంపీ, భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, ఫోన్ తీసుకున్నందుకు భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య, అడ్డు వచ్చిన కొడుకుపై కూడా దాడి

Teen Killed Father & Brother: ప్రేమ‌కు అడ్డుగా ఉన్నార‌ని తండ్రి, 9 ఏళ్ల త‌మ్ముడిని చంపి ముక్క‌లుగా న‌రికిన 15 ఏళ్ల బాలిక‌, శ‌వాల‌ను ప్రిజ్ లో పెట్టి ప్రియుడితో క‌లిసి ప‌రార్, 2 నెల‌ల త‌ర్వాత అరెస్ట్

Prajwal Revanna Arrested: ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Marriage Cheating: ఆస్తి కోసం ఇంత మోసమా, అమ్మాయిలా నటించి పెళ్ళి చేసుకున్న అబ్బాయి, శోభనం రోజు బండారం బయటపడుతుందని ఏం చేశాడంటే..

Chhattisgarh Encounter: బ‌స్త‌ర్ అడ‌వుల్లో కాల్పుల మోత‌! చ‌త్తీస్ గ‌డ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, ఏడుగురు మావోయిస్టులు మృతి