
Pune, Feb 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో (Pune Bus Rape Case) నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గడేను క్రైం బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ (Arrest) చేశారు. మహారాష్ట్రలోని అత్యంత రద్దీ బస్ స్టేషన్లలో ఒకటైన స్వర్ గేట్ బస్టాండ్ లో మంగళవారం ఉదయం నిందితుడు ఘాతుకానికి తెగబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బస్సు కోసం వేచి చూస్తున్న ఓ యువతి (26)తో ‘అక్కా’ అని మాటలు కలిపిన నిందితుడు మాటలు కలిపి నమ్మించాడు. ఆపై ఆమె వేచి చూస్తున్న బస్సు మరో ప్రాంతంలో ఉందని నమ్మించి బస్టాండ్ చివరికి తీసుకెళ్లాడు. ఎవరూలేని సమయంలో అక్కడ ఆగివున్న బస్సులోకి బాధితురాలిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర సంచలనమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రివార్డు ప్రకటించింది.
బస్సులో యువతిపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన
ఈ నెల 25వ తేదీన స్వర్ గేట్ బస్ స్టేషన్ లో పార్కు చేసిన బస్సులో యువతిపై రామ్ దాస్(36) అఘాయిత్యం
రామ్ దాస్ కోసం డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల గాలింపు
నిందితుడి ఫోటోను విడుదల చేసి రూ.లక్ష రివార్డు… pic.twitter.com/qHLPkC3eIB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 28, 2025
చెరుకు తోటలో దాక్కుంటే..
బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. బస్టాండ్ లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శిరూర్ తహసీల్ లోని ఓ గ్రామంలోని చెరుకు తోటలో దాక్కున్న నిందితుడిని పోలీస్ డాగ్స్, డ్రోన్ల సాయంతో గుర్తించి తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి కోసం గత 75 గంటలుగా శ్రమించారు.