School Holidays in AP: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు, షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు, మే 5 నుంచి 23 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం జగన్

ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati, Aprl 19: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు.

ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 24కి పూర్తవుతున్నాయని, ఆపై థియరీ పరీక్షలు మే 5 నుంచి 23 వరకు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం పూర్తయిందని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇప్పటివరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.

ఏపీలో లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ నియంత్రణ, కర్నూల్‌ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కరోనా‌ ఆసుపత్రులు, తాజాగా 6,582 మందికి కోవిడ్ పాజిటివ్, 22 మంది మృతితో 7,410కి చేరుకున్న మరణాల సంఖ్య

కరోనా నిబంధనలు పూర్తిస్థాయిలో పాటిస్తూనే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుపుతామని అన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.