Coronavirus Cases in India (Photo Credits: PTI)

Amaravati, April 18: ఏపీలో గడచిన 24 గంటల్లో 35,922 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,582 మందికి పాజిటివ్ అని నిర్ధారణ (Andhra Pradesh reports 6,582 new Covid-19 cases) అయింది. చిత్తూరు జిల్లాలో 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 912, గుంటూరు జిల్లాలో 804, కర్నూలు జిల్లాలో 729 కేసులు గుర్తించారు.ఒక్క పశ్చిమ గోదావరి మినహాయించి అన్ని జిల్లాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మరోసారి వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

2,343 మంది కోలుకోగా, 22 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,62,037 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,09,941 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 44,686 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,410కి పెరిగింది. చిత్తూరులో గడిచిన 24 గంటల్లో 1, 171 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 804, కర్నూలులో 729, శ్రీకాకుళం 912 కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అయింది.

ఇంట్లో ఉన్నా కరోనా అటాక్ చేస్తుంది, గాల్లో సుమారు మూడు గంటల పాటు వైరస్, ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లు తప్పక ధరించాలని చెబుతున్న వైద్యులు, రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాల‌ని సూచించిన అంటు వ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఫ‌హీమ్ యూన‌స్‌

చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైల్లో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో దూషించారని పేర్కొంటూ కేవీ పల్లి మండలం, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జి. రామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 15వ తేదీన జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేసి స్థానిక సబ్ జైలుకు తరలించిన పోలీసులు జడ్జి రామకృష్ణకు వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ పరీక్ష చేయించారు. ఆదివారం వచ్చిన రిపోర్టులో ఆయనకు కరోనా అని నిర్ధారణ అయింది.

కర్నూల్‌ జిల్లాలో కొత్తగా 11 ప్రైవేటు కోవిడ్‌ ఆసుపత్రులను సిద్ధం చేశామని డిప్యూటి సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కాగా, ఆదోని కస్తూరిభా గాంధీ స్కూల్‌లో 53 మంది విద్యార్థులకు కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు, డీఎమ్‌హెచ్‌వో అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఆదోని గాంధీస్కూల్‌లో కరోనా పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒకవేళ.. కరోనా తీవ్రత అధికంగా ఉన్నవారికి ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, కరోనాను ఎదుర్కొవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు సజీవ దహనం, దేశంలో కొత్తగా 2 ,61,500 మందికి కరోనా నిర్ధారణ, తాజాగా 39 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్

కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ (Coronavirus Vaccination) ఒక్కటే అస్త్రమని, దీనిపై అధికార యంత్రాంగం అంతా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశించారు. లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదని తెలిపారు. గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతినగా, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం స్పష్టం చేశారు.