New Delhi, April 18: దేశంలో కరోనావైరస్ చాలా ప్రమాదకరంగా మారింది. రోజు రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలుచోట్ల కఠిన నిబంధనలు విధించారు. ఈ వైరస్ పలు లక్షణాలతో సోకుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.అంతేకాకుండా ప్రతిరోజు ఇంట్లో ఉన్న కూడా మాస్క్ లను వాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తోందన్న లాన్సెట్ అధ్యయనంపై అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్ (Diseases expert Dr Faheem Younus) ట్విటర్‌లో స్పందించారు . దీనికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్‌లు ధరించడం కంటే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లు (Use N95 or KN95 masks) ధరించడమే అని ఆయన స్పష్టం చేశారు.
Here's Faheem Younus Tweet
Lancet study:
“Airborne” does NOT mean outside air is contaminated. It means the virus may remain suspended in the air — typically in indoor settings —and pose a risk
Our parks and beaches are still the safest places to enjoy without a mask (provided 6 ft distance)
— Faheem Younus, MD (@FaheemYounus) April 17, 2021
రెండు మాస్క్‌లు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని (keep alternating every 24 hours) ఆయన సూచించారు. లాన్సెట్ అధ్యయనం చూసి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ స్పెక్ట్రం (తుంపర్ల నుంచి గాలి ద్వారా)లో వ్యాపిస్తుందని మనకు తెలుసు.
దీనికి పరిష్కారం ఒక ఎన్95, ఒక కేఎన్95 మాస్కులు ధరించడమే. వీటిని ఒక్కో రోజు ఒక్కొక్కటి వాడండి. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్‌లో ఉంచి ఆ మరుసటి రోజు వాడాలి. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవ్చు. బట్టతో చేసిన మాస్క్‌లు వద్దు అని ఫహీమ్ యూనస్ ట్వీట్ చేశారు. గాలి ద్వారా వైరస్ (Covid ‘airborne) వ్యాపిస్తున్నంత మాత్రాన మన బయట ఉన్న గాలి మొత్తం కలుషితం అయిపోయిందని కాదు.
దీనర్థం వైరస్ గాల్లోనే ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. ముఖ్యంగా నాలుగు గోడల మధ్య ఈ ముప్పు ఎక్కువ. ఒకవేళ ఆరు అడుగుల దూరం పాటిస్తూ ఉంటే మన పార్కులు, బీచ్‌లు మాస్కులు పెట్టుకోకుండా కూడా చాలా సురక్షితం అని యూనస్ చెప్పడం విశేషం. ఈ సమయంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అంటూ వైద్యులు కూడా తెలుపుతున్నారు.
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోవాలని హెచ్చరిక
ఈ వైరస్ వ్యాపిస్తుందని అంటున్నప్పటికీ దీనివల్ల గాలి కలుషితం కాదని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లో రీసెర్చర్ అయిన యూనస్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వైరస్ గాల్లో సస్పెండెడ్ స్థితిలో ఉంటుందని, ఇంటి లోని వాయువులో కూడా ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇదే రిస్క్ అని ఆయన తెలిపారు. ల్యాబ్ ప్రయోగాల్లో ఈ వైరస్ గాల్లో సుమారు మూడు గంటలు ఉంటుందని తేలినట్టు బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం తెలిపింది.
కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆస్పత్రుల ఎయిర్ ఫిల్టర్లు లేదా భవనాల గవాక్షాల్లో కూడా ఈ వైరస్ ఉంటుందని ఈ బృందం అభిప్రాయపడింది. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని వివరించింది. కాగా గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందన్నది గతంలో కూడా వార్తగా వచ్చింది. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్ల ద్వారా ఇది వ్యాపిస్తుందని లోగడ మొదట నిపుణులు తెలిపారు. ఇప్పుడు గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుందని లాన్సెట్ స్టడీ తన ప్రయోగాల ద్వారా చెబుతోంది.