Jagananna Smart Town: జగనన్న స్మార్ట్‌ టౌన్‌కు దరఖాస్తులు స్వీకరణ, విజయవాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలు, రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ అర్హులే

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకానికి (Jagananna Smart Town scheme) శ్రీకారం చుట్టింది.

Andhra pradesh Cm Ys Jagan( Photo-Twitter)

Amaravati, April 6: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకానికి (Jagananna Smart Town scheme) శ్రీకారం చుట్టింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 5 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా జగనన్న స్మార్ట్‌‌టౌన్‌ (Jagananna Smart Town) ద్వారా ఇంటి స్థలాలను అందించనుందని వీఎంసీ కమిషనర్‌ ప్రసన్నవెంకటేష్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.అన్ని వసతులతో ఈ స్థలాలను అభివృద్ధి చేసి అందించనున్నట్టు వివరించారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉండేలా ఇళ్ళ స్థలాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక మధ్యతరగతి వారికి అందించే ఈ స్థలాలను అన్ని వసతులతో ను అభివృద్ధి చేసి అందిస్తామని వివరించారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటుగా పార్కులు , మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. కమ్యూనిటీ హాల్ , పాఠశాల భవనాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. షాపింగ్ సెంటర్, బ్యాంక్, మార్కెట్ వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం మొదలగు అన్ని వసతులను కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వాటర్ , విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు .

రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ(ప్రభుత్వ ఉద్యోగులు కూడా) ఈ పథకానికి అర్హులని, 150 చదరపు గజాల స్థలం పొందాలంటే రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షలు, 240 చదరపు గజాల స్థలానికి రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు సంవత్సరాదాయం ఉండాలని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ఈనెల 6,7 తేదీల్లో డిమాండ్‌ సర్వే నిర్వహిస్తారని, అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

దేశంలో కోవిడ్ కలవరం, 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో రేపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అత్యవసర సమావేశం, ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 7,244కి చేరుకున్న మరణాల సంఖ్య

200 చదరపు గజాలకు అంటే నాలుగు సెంట్లకు సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి ఆరు లక్షల నుండి 12 లక్షల రూపాయలు ఉండాలని , 240 చదరపు గజాలకు అంటే ఐదు సెంట్లకు సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి 12 లక్షల నుండి 18 లక్షల రూపాయలు ఉండాల్సి ఉంటుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని , దరఖాస్తు చేసుకోవచ్చని విజయవాడ నగర కమిషనర్ పేర్కొన్నారు.

మీ దగ్గర్లోని ఎమ్మార్వో ఆఫీసులో కాని లేదా కలెక్టరేట్ కార్యాలయంలో గాని అప్లికేషన్లు, సచివాలయంలో కాని జగనన్న స్మార్ట్‌ టౌన్ పథకానికి సంబంధించి అప్లికేషన్లు ఇస్తారు. వాటిని మీరు పూర్తి చేసి అక్కడ ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు జత చేస్తే సరిపోతుంది. ఆ తరువాత వారు పథకానికి అర్హులైన వారికి జాబితాను తయారు చేసి వారికి పట్టాలు అందించడం జరుగుతుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now