APPSC Group 2 Results: ఉత్కంఠ‌కు తెర! గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ, ఎల‌క్ష‌న్ కోడ్ కార‌ణంగా ఫ‌లితాలు వాయిదా ప‌డుతాయ‌ని ఊహాగానాలు

ప్రిలిమ్స్‌ ఫలితాలను (Prelims Exam Results) ఏపీపీఎస్సీ (APPSC) బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు.

APPSC Logo(Photo-File Image)

Vijayawada, April 10: ఎట్టకేలకు గ్రూప్‌ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్‌ ఫలితాలను (Prelims Exam Results) ఏపీపీఎస్సీ (APPSC) బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్‌ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే.. ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌ ఉండటంతో గ్రూప్‌ 2 ఫలితాలను (Prelims Exam Results) వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌ – 2 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

 

ఇందులో 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్‌ చేశారు. ఈ మేరకు క్వాలిఫై, రిజెక్ట్‌ అయిన అభ్యర్థుల జాబితాను వేర్వేరుగా విడుదల చేశారు.



సంబంధిత వార్తలు