Salute Police: లాక్‌డౌన్ కాలంలో అంకితభావంతో సేవలందిస్తునందుకు కృతజ్ఞతగా పోలీసులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే, ప్రతిగా ఎమ్మెల్యేకు సెల్యూట్ చేసిన పోలీస్
వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే ఫాల్గునా పోలీసుల వద్దకు వెళ్లి ఏఎస్ఐ మోహన్ రావ్ పాదాలను తాకుతూ నమస్కారం చేశారు. అందుకు ప్రతిగా ఏఎస్ఐ పోలీస్ సెల్యూట్ తో ఎమ్మెల్యేను గౌరవించారు.....
Vishakhapatnam, April 2: దేశంలో లాక్ డౌన్ (Lockdown) విధించిన నేపథ్యంలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఆపద కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు కొనసాగిస్తున్న పోలీసుల (Police Services) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతగా కష్టపడుతున్న పోలీసుల పాదాలకు నమస్కరించి ఓ ఎమ్మెల్యే తన కృతజ్ఞతను తెలియజేశారు. వైరస్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకండి; ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఫాల్గునా (Araku MLA Phalguna) బుధవారం సాయంత్రం తన కారులో వెళ్తుండగా లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్న పోలీసులు కనిపించారు. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే ఫాల్గునా పోలీసుల వద్దకు వెళ్లి ఏఎస్ఐ మోహన్ రావ్ పాదాలను తాకుతూ నమస్కారం చేశారు. అందుకు ప్రతిగా ఏఎస్ఐ పోలీస్ సెల్యూట్ తో ఎమ్మెల్యేను గౌరవించారు.
Here's ANI Update:
ఎమ్మెల్యే తన పాదాలకు నమస్కారం చేయడం పట్ల ఏఎస్ఐ మోహన్ రావు స్పందించారు. ఒక ఎమ్మెల్యే వచ్చి తన పాదాలకు నమస్కారం చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిందని అయితే, క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో అంకితభావంతో సేవలందిస్తున్న పోలీసు శాఖ అంటే తనకు చాలా గౌరవం ఉందని, అందుకే పోలీసులందరికీ పాదాభివందనం చేస్తున్నాను అంటూ ఎమ్మెల్యే ఫాల్గునా చెప్పండంతో ఎంతో గర్వంగా ఫీలయ్యానని ఏఎస్ఐ అన్నారు. తన డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు, యూనిఫాం వేసుకున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.