Atchannaidu Kinjarapu: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు
ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను ( L Ramana) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్ (Nara Lokesh) నియమితులయ్యారు.
Amaravati, Oct 19: ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడును (Atchannaidu Kinjarapu) నియమించారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను ( L Ramana) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్ (Nara Lokesh) నియమితులయ్యారు.
తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేయగా, 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.
పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్‌గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు.