Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.

Big twist on Duvvada Srinivas episode, Madhuri tries to commit suicide!(X)

Vij, Aug 11: దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.

ఇది గడిచి 24 గంటలు కాకముందే దువ్వాడ శ్రీనివాస్ - వాణి - మాధురి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సూసైడ్ చేసుకోవాలని భావించిన మాధురి ఓ ఆగి ఉన్న కారును ఢీ కొట్టారు. టెక్కలి నుండి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఓ కారును ఢీకొట్టింది మాధురి. సూసైడ్ చేసుకోవాలని కారును ఢీ కొట్టానని చెప్పగా వెంటనే ఆమెను పలాస గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాధురి తలకు గాయాలు కాగా తనకు చికిత్స అవసరం లేదని మొండికేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ రెండు కుటుంబాల్లో నెలకొంది.  మాకు నాన్న కావాలి, నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు, వాణికి విడాకులు ఇస్తానని వెల్లడి

Here's Video:

ఇక వాణితో విభేదాలపై మరింత క్లారిటీ ఇచ్చిన దువ్వాడ ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు తెలిపారు. మాధురి ఒక డ్యాన్సన్ టీచర్ అని..ఆమెను తనకు పరిచయం చేసింది వాణి అని చెప్పారు. మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగట్టగా గతంలో మాధురి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు శ్రీనివాస్. తన కుటుంబం వలన చనిపోబోయిన అమ్మాయికి తాను దగ్గర అయ్యానని చెప్పారు. త్వరలోనే వాణికి విడాకుల నోటీస్ ఇస్తానని చెప్పారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించారు మాధురి.