Botsa Satyanarayana Files Nomination: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్, రాజకీయాలను వ్యాపారం చేశారని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.
Vishakapatnam, Aug 12: విశాఖపట్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు బొత్స. రాజకీయాలను టీడీపీ నేతలు వ్యాపారంగా మార్చారని తెలిపారు.
మెజారిటీ లేకున్న ఎందుకు పోటీ పెడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపు తనదేనని, 13 తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. కూటమి నేతలు అభ్యర్థిని నిలబెట్టడం అనైతికం అన్నారు. వైసీపీకి 620 ఓట్లు ఉన్నాయని టీడీపీకి 200 ఓట్లు కూడా లేవన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని, తన ఇల్లు ఇక్కడే ఉందని చెప్పారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం 838 ఓటర్లు ఉండగా ఇందులో మెజార్టీ ఓట్లు వైసీపీవే. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండగా టీడీపీ కూటమి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!
టీడీపీ ఎమ్మెల్పీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. పలువురి పేర్లను పరిశీలించిన చంద్రబాబు చివరకు బైరా దిలీప్ చక్రవర్తి పేరుకు ఓకే చేశారని సమాచారం. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ తరుపు నుంచి పోటీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పొత్తులో అనకాపల్లి సీటు బీజేపీకి వెళ్లడంతో ఆయనకు టికెట్ దక్కలేదు.