Three Capitals Row: మూడు రాజధానులు తప్పులేదు, ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు, విభజన చట్టంలో రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
ఇందులో భాగంగా మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు (Three Capitals) తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో (bifurcation Act) ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.
Amaravati, Sep 12: ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి కార్లిటీ (Centre clarifies on 3 capitals in AP) ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు (Three Capitals) తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో (bifurcation Act) ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.
మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ పేర్కొంది. విభజన చట్టంలో రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం (financial assistance) చేస్తామని మాత్రమే చెప్పామని కేంద్రం చెప్పింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
ఇటీవల మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ సైతం ఆమోద ముద్ర వేసిన సంగతి విదితమే. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు. రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి కొనసాగేలా గవర్నర్ రాజముద్ర వేశారు.
మూడు రాజధానులపై అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను ఆందోళనను కొనసాగిస్తుండగా.. మరో వైపు ఏపీ హైకోర్టులో మూడు రాజధానులపై వాదనలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే ఓ సారి హైకోర్టుకు రాజధానితో మాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మళ్లీ రెండోసారి అఫిడవిట్ ధాఖలు చేస్తూ మేము జోక్యం చేసుకోబోమని వెల్లడించింది.