NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..

ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.

NTR Anna Canteens

Gudiwada, August 15: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు. పేదలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ను పునరుద్ధరించడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాము కూడా టోకెన్ తీసుకుని భోజనం చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు ప్రజలతో కాసేపు ముచ్చటించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం గుడివాడలో క్యాంటీన్ ప్రారంభం కాగా.. మిగతా 99 క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు రూ.5 లకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం రూ. కోటి విరాళం అందించిన విషయం తెలిసిందే.  2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు

అన్న క్యాంటీన్లలో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమేనని సీఎం వ్యాఖ్యానించారు. కడుపు నిండా తిండి తినాలని కోరుకుంటామని తెలిపారు. ఆయన డొక్కా సీతమ్మ గురించి కూడా ప్రస్తావించారు. నాడు గోదావరి దాటి వచ్చిన వాళ్లకు డొక్కా సీతమ్మ తిండి పెట్టేదని, ఇప్పటికీ డొక్కా సీతమ్మను అన్నదానంలో మేటి మహిళగా గుర్తుపెట్టుకున్నామని చంద్రబాబు వివరించారు.

ఎన్టీ రామారావు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తాము అన్న క్యాంటీన్లను తీసుకువస్తే, గత ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని అన్నారు. రద్దు చేయవద్దు... క్యాంటీన్లకు మీ పేరే పెట్టుకుని వాటిని కొనసాగించండి... పేదలకు పట్టెడన్నం పెట్టండి అని ఆనాడు కోరాం. ఒకవేళ మీరు అన్నం పెట్టలేకపోయినా దాతలు వస్తారని చెప్పాం. కానీ గత ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం పెడుతుంటే అడ్డుకున్నారు. ఇక అలాంటి పరిస్థితి రాదు. సెప్టెంబరు నెలాఖరు నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు తీసుకువస్తాం.

పేదవాళ్లకు తిండిపెట్టడం మనందరి కనీస బాధ్యత. ఓ మంచి ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ కార్యక్రమం కోసం హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదాయకం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నా. ఇది శాశ్వతంగా కొనసాగించే కార్యక్రమం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఖర్చుపెడితే భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి" అని చంద్రబాబు వివరించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif