Chandrababu Naidu Oath Date: న‌రేంద్ర మోదీ కోసం వెన‌క్కు త‌గ్గిన చంద్ర‌బాబు, ప్ర‌మాణ స్వీకారం తేదీ మార్పు, ఇంత‌కీ కొత్త డేట్ ఎప్పుడంటే?

గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ (YSRCP) ఈసారి 11సీట్లకే పరిమితమయ్యి ఘోర పరాభవం మూట కట్టుకుంది.

TDP To Leave NDA? PM Narendra Modi, Amit Shah Dial Chandrababu Naidu Amid Vote Counting for Lok Sabha Elections Results

Vijayawada, June 06: ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి (AP Kutami) చారిత్రాత్మక విజయం నమోదు చేయటంతో కూటమి శ్రేణులు విజయోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ (YSRCP) ఈసారి 11సీట్లకే పరిమితమయ్యి ఘోర పరాభవం మూట కట్టుకుంది.ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు (Chandrababu Oath) ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్నాడు. మొదట జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించింది టీడీపీ.తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీని (Oath Date) మార్చాలని నిర్ణయించారు చంద్రబాబు. ఈ నెల 12న ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేసే అవ‌కాశ‌ముంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ లోగా కేబినెట్ కూర్పుపై కూడా క‌స‌రత్తు పూర్త‌య్యే అవ‌కాశ‌ముంది.

Chandrababu on Election Result: ఎన్డీఏ కూటమి సమావేశం తర్వాత అప్‌డేట్ ఇస్తా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడి  

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. 9న ప్రధానిగా నరేంద్ర మోడీ (Modi) ప్రమాణ స్వీకారం చేయనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణం చేయనుండగా, సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉంది.