Andhra Pradesh: ఏపీలో ఘోర విషాదాలు, చింతాల మునిస్వామి రథోత్సవంలో ఇద్దరు భక్తులు మృతి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో సీనియర్‌ మేనేజర్‌ మృతి, నల్లమల ఘాట్‌ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతి

చింతాల మునిస్వామి రథోత్సవంలో (Chariot Festival) పాల్గొన్న ఇద్దరు భక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

Representational Image (Photo Credits: Twitter)

Amaravati, August 18: ఏపీలో కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో విషాదం చోటు చేసుకుంది. చింతాల మునిస్వామి రథోత్సవంలో (Chariot Festival) పాల్గొన్న ఇద్దరు భక్తులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఉదయం రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి విద్యుత్‌ తీగలు తీగలడంతో ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అదే గ్రామానికి చెందిన వీరాంజనేయులు, వెంకటేశులుగా గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బుదవారం ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌పై నుంచి జారిపడి సీనియర్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు మృతి చెందారు. స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-1లో మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనకు సం‍బదించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

పెళ్లి కాలేదని యువకుడు, పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య, తెలంగాణ రాష్ట్రంలో విషాద ఘటనలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆత్మకూరు నల్లమల ఘాట్‌ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్‌ విజయేంద్ర సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ లతన్‌ యోగి ఎడమకాలు విరిగి గాయాలయ్యాయి. రాజస్థాన్‌కి చెందిన లారీ విశాఖ నుంచి బళ్లారికి ఐరన్‌ షీట్లు తీసుకుని వెళుతోంది. దోర్నాల– ఆత్మకూరు నల్లమల ఘాట్‌లోని రోళ్లపెంట వద్ద మలుపు తిరిగే సమయంలో లారీ అదుపు తప్పి కొండను ఢీకొని రోడ్డుపై అడ్డుగా ఉండిపోయింది.

దీంతో నల్లమలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ మృతదేహాన్ని, క్లీనర్‌ను బయటకు తీశారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్‌ చేశారు.