Chittoor Ammonia Gas Leakage: చిత్తూరు పాల డెయిరీలో గ్యాస్ లీకేజి, 14 మందికి అస్వస్థత, అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఘటన, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి (Bandapalli village) హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు.
Chittoor, August 21: ఏపీలోని చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలంలో గురువారం రాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్ (Chittoor Ammonia Gas Leakage) కావడంతో 20మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100మందికి పైగా కార్మికులు ఉండగా వారిలో 14మంది మహిళా కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. పూతలపట్టు మండలం బండపల్లి (Bandapalli village) హట్సన్ పాల డెయిరీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాలు కోల్డ్ స్టోరేజ్ కోసం అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఆ వాయువు లీక్ కావడంతో 14మంది అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్వాహకులు చిత్తూరు, గుడిపాల ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు.
పాల డెయిరీ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.మరోవైపు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా హట్సన్ పాల డెయిరీని పరిశీలించారు. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ లీక్ సంఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీరియర్ అయ్యారు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
Update by ANI
ఈ సంఘటన జరిగిన వెంటనే, పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా(collector Narayan Bharath Guptha) , పోలీసు సూపరింటెండెంట్ సెంధిల్ కుమార్ ( Superintendent of Police Sendhil Kumar) వెంటనే లొకేషన్‌కు చేరుకున్నారు. లీకేజీకి కారణం గురించి ఆయన మాట్లాడుతూ.., అమ్మోనియా వాయువును కలిగి ఉన్న పైపును పట్టుకునేటప్పుడు ఈ గ్యాస్ లీకేజ్ సంభవించింది. గ్యాస్ లీక్ అనేక మంది కార్మికులను ప్రభావితం చేసింది "అని గుప్తా చెప్పారు. కమ్మేసిన పొగ..పనిచేయని ఫోన్లు, ప్లాంట్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన రెస్కూ టీం, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్
"అందరూ స్థిరంగా ఉన్నారు. వారందరూ మహిళలు. ఈ సంఘటన నిర్వహణ నిర్లక్ష్యం లేదా కార్మికుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు భూస్థాయి పరిస్థితిని సమీక్షిస్తారు అని తెలిపారు. ఈ ఘటనపై వివరాలను కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి జిల్లా కలెక్టర్, ఎస్పీ సెంథిల్ కుమార్లతో మాట్లాడారు.