Another Case Against Chandrababu: చంద్రబాబుకు సీఐడీ మళ్లీ షాక్, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణలపై మరో కేసు నమోదు

గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు.

chandrababu (Photo-PTI)

CID Filed Another Case Against Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌, రేపు వెల్లడిస్తామని తెలిపిన ధర్మాసనం

చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది.ఇప్పటికే పలు కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే.