chandrababu (Photo-PTI)

Vjy, Oct 30: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. మెయిన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడనేది మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

స్కిల్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరయ్యారు.

రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించిన సీఎం జగన్, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి

చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఆయన వాదనలు ఉదయమే ముగిశాయి. లూథ్రా కూడా చంద్రబాబు ఆరోగ్యపరమైన అంశాలపైనే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.