Amaravati Inner Ring Road Case: చంద్రబాబు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుతో సహా మరో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేయగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేసింది.

N-Chandrababu-Naidu

Vjy, Sep 11: టీడీపీ అధినేత అధినేత చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ రెండు పిటిషన్‌లు దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేయగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ నమోదు చేసిన కేసులో చంద్రబాబును కస్టడీకి కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేసింది.

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.2022లో నమోదైన ఈ కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.

పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం, పీవీ రమేశ్ స్టేట్ మెంట్‌తోనే కేసు నడవడం లేదని తెలిపిన సీఐడీ వర్గాలు

ఇక ఏసీబీ కోర్టులో చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి.చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌ను తిరస్కరించాలంటూ సీఐడీ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు. బాబును హౌజ్‌ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు.

చంద్రబాబుకు రాజమండ్రి జైలులో స్నేహ బ్లాక్ కేటాయింపు, తొలి రోజు ఇంటి నుంచి బ్లాక్ కాఫీ, ఫ్రూట్ సలాడ్, రోజుకు ముగ్గురిని కలిసేందుకు కోర్టు అనుమతి

ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్‌ అరెస్ట్‌ అనేది అవసరం లేదని తన పిటిషన్లో పేర్కొంది. సీఆర్‌పీసీలో హౌజ్‌ అరెస్ట్‌ అనేదే లేదు. బెయిల్‌ ఇవ్వలేదు కాబట్టే హౌజ్‌ రిమాండ్‌ కోరుతున్నారు. అరెస్ట్‌ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్‌ కాపీలో పేర్కొంది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు