YSR Rythu Bharosa: నేడు వైఎస్‌ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు విడుదల, ఆళ్లగడ్డలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్న ఏపీ సీఎం జగన్
వైఎస్‌ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు నేడు రౌతుల అకౌంట్లో జమకానుంది.
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు నేడు రౌతుల అకౌంట్లో జమకానుంది. ఏపీ సీఎం జగన్ ఆళ్లగడ్డలో బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు. అనంతరం వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు.
వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు. మే నెలలో ఖరీఫ్‌కు ముందే తొలి విడత సాయాన్ని అందజేసింది.మూడో విడుతను సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది. తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్‌ఆర్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం.