Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన స్వచ్చ సర్వేక్షణ్‌– 2022 అవార్డు గ్రహితలు, 11 మంది అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి, అవార్డులు ఎందులో వచ్చాయింటే..

స్వచ్చ అమృత్‌ మహోత్సవ్‌ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో 11 అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకున్న సండతి విదితమే.

CM Jagan congratulated 11 winners of awards in Swachh Sarvekshan-2022 (Photo-Twitter/APCMO)

Amaraavti, Oct 7: స్వచ్చ అమృత్‌ మహోత్సవ్‌ కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో 11 అవార్డులు  ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకున్న సండతి విదితమే. ఈ సందర్భంగా   స్వచ్చ సర్వేక్షణ్‌– 2022 అవార్డు గ్రహీత కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు, కమిషనర్లు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  సీఎం వైయస్‌.జగన్‌ను కలిశారు.  అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అభినందనలు తెలిపారు.

అవార్డుల వివరాలు

1. గార్భేజ్‌ ఫ్రీ సిటీస్‌ అవార్టు కేటగిరీలో 5 స్టార్‌ రేటింగ్‌ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్‌ షెహర్‌ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ డాక్టర్‌ ఆర్‌ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్‌ అనుపమ అంజలి.

2.గార్భేజ్‌ ఫ్రీ సిటీస్‌ అవార్టు కేటగిరీలో 5 స్టార్‌ రేటింగ్‌ అవార్డుతో పాటు బిగ్‌ క్లీన్‌ సిటీ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్‌, కమిషనర్‌ రాజబాబు, అడిషనల్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాధ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాస్త్రి.

3.క్లీన్‌ స్టేట్‌ క్యాపిటల్‌ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్, అడిషనల్‌ కమిషనర్‌ కె వి సత్యవతి.

4.50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న పులివెందుల మున్సిపాల్టీ ఛైర్మన్‌ వి వరప్రసాద్, వైస్‌ ఛైర్మన్‌లు వైయస్‌.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్‌ వి వి నరసింహారెడ్డి.

Here's AP CMO Tweet

5.

50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న పుంగనూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌ అలీమ్‌ భాషా, కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌.

6.ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్‌ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్‌ కమిషనర్‌ కె డేనియల్‌ జోసఫ్, మున్సిపల్‌ మేనేజర్‌ ఎస్‌ వి శ్రీకాంత్‌రెడ్డి.

7.ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌ కేటగిరీ(1 నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్‌ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేశు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ జి వెంకటరావు.

8.25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ కేటగిరీలో అవార్డు గెల్చుకున్న సాలూరు మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్‌ హనుమంతు శంకరరావు.

మున్సిపల్‌ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం, నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై చర్చ

కార్యక్రమలో పాల్గొన్న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ పి సంపత్‌ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ సీఓఓ కిరణ్‌ కుమార్, టీం లీడర్‌ పాతూరు సునందలు



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి