YSR Matsyakara Bharosa: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నానని వెల్లడి

మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు.

YS Jagan (Photo-Video Grab)

Nizampatnam, May 16: వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. బాపట్లలోని నిజాంపట్నంలో సీఎం జగన్ వైఎస్సార్‌ మత్స్యాకార భరోసా నిధులను మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద రూ.123.52 కోట్లతో పాటు ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు.

కాగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందజేయడం జరిగింది. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ. 10వేల చొప్పున సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు రూ.108 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

ఏపీలో ఎండదెబ్బకు నలుగురు మృతి, రెండు రోజులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరిక, అన్ని జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు.పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నామని అన్నారు.

రైతు కన్నీటి కథ ఇదిగో, కూలీ ఖర్చులు రాలేదని 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది. చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ.104 కోట్లు. మన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం. గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నామని సీఎం తెలిపారు.



సంబంధిత వార్తలు

Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif