CM Jagan Slams Congress: ఇప్పటికిప్పుడు సీఎం పదవి దిగిపోయినా బాధపడను, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్‌ నీచ రాజకీయాలతో మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని మండిపాటు

తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు.

YS jagan (Credits: X)

Tirupati, Jan 24: ఏపీలో కాంగ్రెస్‌ (Congress) పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని వైసీపీ(YSRCP) అధినేత, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan) విమర్శించారు. తిరుపతిలో ఇండియాటుడే విద్యాసదస్సుకు సీఎం జగన్ (CM Jagan Mohan Reddy) హాజరయ్యారు. India Today Education Conferenceలో సీఎం మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విడదీసింది. గతంలో మా బాబాయిని మంత్రిని చేసి మాపై ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. నా సోదరిని ఏపీ అధ్యక్షురాలిగా చేసి నాపై ప్రయోగిస్తోంది. విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానం. కాంగ్రెస్‌ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు.

 ఏపీ ఎన్నికలు, లోక్ సభకు రూ.25,000, అసెంబ్లీకి రూ. 10,000, సీటు ఆశించే వారి నుంచి 'విరాళం'గా వసూలు చేస్తున్న కాంగ్రెస్

ఆ పార్టీకి మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోయినా బాధపడను. వైకాపా మేనిఫెస్టోలోని 99శాతం హామీలు నెరవేర్చాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మా పార్టీయే గెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. సర్వేల ఆధారంగానే వైకాపాలో టికెట్ల కేటాయింపు’’ అని జగన్‌ వివరించారు.

తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని.. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది. కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతుంది. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు’’ అని సీఎం ధ్వజమెత్తారు

జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా, చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు స్టార్ క్యాంపెయినర్లు తెగ కష్టపడుతున్నారని సెటైర్లు

ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు. ఇదే బడ్జెట్‌ గతంలోనూ ఉంది..ఇప్పుడూ ఉంది. కాని అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు. మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు. చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదు. సీఐడీని దుర్వినియోగం ఆరోపణలు అర్థరహితం. చంద్రబాబుపై ఆరోపణలు, వాటిపై ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. పేదరికాన్ని నిర్మూలించాలంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతాను. విద్య మాత్రమే కాదు, నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరి హక్కు కావాలి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

పేద పిల్లలు కేవలం తెలుగుమీడియంకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు ఇంగ్లిషు మీడియం చదువుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలి. మా రాష్ట్రంలో పేదపిల్లలకు సంపన్నుల పిల్లలకు అందే చదువులు అందాలన్నదే మా లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు. కొందరు పెద్దలు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిషు మీడియం స్కూళ్లగా మారుస్తున్నామని.. కాని నేను ఒక్కటే అడుగుతున్నా.. మీ పిల్లలు, మీ మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు?.

వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారా?. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిషు విద్యను అదించడంలో సమగ్రమైన విధానాన్ని అనుసరిస్తున్నాం. బై లింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను అందిస్తున్నాం. బైజూస్‌ కంటెంట్‌ పాఠాలను నేర్పిస్తున్నాం. స్కూళ్లలో నాడు – నేడు కింద మంచి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి పైబడి ఉన్న తరగతి గదులలో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ పెడుతున్నాం. సుమారు 60వేల గదుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ పెడుతున్నాం. ఇప్పటికే సుమారు 40వేల గదుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఫిబ్రవరి చివరి నాటికి మిగిలినవీ ఏర్పాటు చేస్తాం’’ అని సీఎం వివరించారు.

‘‘సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టునూ 3వ తరగతి నుంచీ అమలు చేస్తున్నాం. టీచర్లలో బోధనా సామర్థ్యాన్ని పెంచుతున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నాం. ఇందులో ప్రీలోడెడ్‌ బైజూస్‌ కంటెంట్‌ అందిస్తున్నాం. దీనివల్ల ఇప్పటికే 8,9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వద్ద ట్యాబులు ఉన్నాయి. అలాగే పిల్లలకు ఐబీ విద్యా విధానంలో బోధనకు శ్రీకారం చుడుతున్నాం. దీనికోసం ఎస్‌ఈఆర్‌టీతో కలిసి ఐబీ పనిచేస్తోంది. పిల్లలకు పాఠ్యప్రణాళికను ఎలా అందించాలన్నదానిపై ప్రత్యేక మార్గదర్శక ప్రణాళిక ఉంది. మొదటి సంవత్సరం టీచర్లకు సమర్థతను పెంచడంపై దృష్టిపెట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు.

2025-26 నుంచి ఒకటో తరగతిలోకి ఐబీ వస్తుంది. అలా ప్రతీ ఏడాదీ తరగతి పెంచుకుంటూ ఐబీ పద్ధతిలో బోధనను పెంచుకుంటూ వెళ్తాం. పిల్లలకు జాయింట్‌ సర్టిఫికెట్‌ కూడా అందిస్తాం. విద్యా బోధనలో నాణ్య అన్నదే చాలా ప్రధానం. దీనిపై మేం ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. నాణ్యత ఉన్నప్పడే ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కోగలరు. ఈ ప్రపంచం తదుపరి దశలోకి వెళ్తోంది. అందులోకూడా మన పేద పిల్లలు రాణించాలి. అలాంటి అవకాశాలు కేవలం సంపన్న పిల్లలకు మాత్రమే ఉన్నాయి. పేదరికంలో ఉన్న పిల్లలకు నాణ్యమైన చదువులు అందుకోవడానికి తగిన అవకాశాలు ఉండాలి. ఇదే మా ఉద్దేశం. ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి’’ అని సీఎం చెప్పారు.

ఐబీలో ఉన్న ప్రతినిధులు సానుకూలతతో ఉన్నారు. నేను కూడా స్వయంగా వారితో మాట్లాడాను. మాతో కలిసి నడవడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎస్‌ఈఆర్‌టీతో కలిసి పనిచేస్తారు. ఇది పెద్ద గేమ్‌ ఛేంజర్‌ కాబోతోంది. రానున్న రోజుల్లో దీనికి అనుగుణంగా టీచర్లకు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతాం. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పూర్తిగా మెరుగుపరిచాం. ఇప్పటికే రూ.౩౦౦ కోట్లు ఖర్చు చేశాం. సుమారు 14 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే మూడింట రెండు వంతుల స్కూళ్లలో పనులు పూర్తి చేశాం’’అని సీఎం తెలిపారు.

‘‘జీఈఆర్‌ రేష్యోలో మేం చాలా దిగువన ఉండేవాళ్లం. దీన్ని మెరుగు పరచడానికి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాం. స్కూళ్లను మెరుగ్గా తీర్చిదిద్దాం. మంచి మధ్యాహ్న భోజనాన్ని గోరుముద్ద కింద అందిస్తున్నాం. ప్రతిరోజూ ఒక మెనూ వారికి అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. మేం చేపట్టిన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి పగడ్బందీ వ్యవస్థలు ఉన్నాయి. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమర్థవంతమైన యంత్రాంగాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రిగా నా దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం మేం స్కూలు విద్యపైనే కాదు, ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం. ఉద్యోగాలు సాధించే కోర్సులను అందిస్తున్నాం. ఇంటర్నషిప్‌ అందిస్తున్నాం. ఆన్లైన్‌ వర్టికల్స్‌ అందిస్తున్నాం. పాఠ్యప్రణాళికలో వీటిని భాగస్వామ్యం చేశాం. పిల్లలు ఆన్లైన్లో మరిన్ని కోర్సులు నేర్చుకునేందుకు 1800 సబ్జెక్టుల్లో కోర్సులను అందించడానికి ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. బీకాం నేర్చుకునేవారికి అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర అంశాలను నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇవన్నీకూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నాం’’ అని సీఎం చెప్పారు.