CBN Gets AC in Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భారీ ఊరట, ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చిన కోర్టు, లంచ్ మోషన్ పిటీషన్ పై ఉత్తర్వులు
ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళనతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు జైల్లో ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
Vijayawada, OCT 14: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల ఆందోళనతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు జైల్లో (Chandra babu) ఉంటున్న గదిలో ఏసీ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఏసీ ఏర్పాటు చేసేందుకు (CBN Gets AC in Jail) అనుమతిచ్చింది.
చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు నివేదించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కొద్దిరోజులు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తరుపున లాయర్లు లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.