AP Curfew Relaxation Update: ఏపీలో మారిన కర్ఫ్యూ సమయం, ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపులు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు

రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ సడలింపు (Covid 19 Curfew Relaxation) సమయాల్లో మార్పులు చేసింది.

Andhra Pradesh Partial curfew (Photo: PTI)

Amaravati, July 5: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు (Covid 19 Curfew Relaxation Timings Changed) ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ సడలింపు (Covid 19 Curfew Relaxation) సమయాల్లో మార్పులు చేసింది. ఇటీవలి వరకు కేసులు అధికంగా వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆ రెండు జిల్లాల్లోనూ సడలింపు సమయాలు మార్చుతున్నట్టు ప్రభుత్వం (Andhra Pradesh government) ప్రకటించింది.

తాజా నిబంధనల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. పాజిటీవీటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఆంక్షల కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది.

సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి

అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్‌ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్‌, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం... శానిటైజర్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది. 50 శాతం పరిమితితో రెస్టారెంట్లు, జిమ్‌లు, కల్యాణ మండపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీట్ల మధ్య ఖాళీ ఉండేలా చర్యలు తీసుకుంటూ సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది.