Srivari Darshan: ఏప్రిల్ 14 వరకు శ్రీవారి దర్శనం రద్దు, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లు మూత, నిర్మానుష్యంగా మారిన తిరుమల, ఏకాంత సేవలో తిరుమల వెంకటేశుడు
దీని దెబ్బకు అన్నీ ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఏప్రిల్ 14 వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేశామని తెలిపింది.
Amaravati,Mar 30: కరోనావైరస్ (Corona Virus) మహమ్మారి దేశ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తూ వెళుతోంది. దీని దెబ్బకు అన్నీ ప్రధాన ఆలయాలు మూతపడ్డాయి. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి ఏప్రిల్ 14 వరకు ఈ రద్దు నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించింది. దాంతోపాటు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లనూ మూసివేశామని తెలిపింది.
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు
ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని టీడీడీ (TTD) పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని చెప్పారు. అలాగే ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అనాథలు, నిరుపేదలను ఆదుకొనేందుకు రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది. ఇక ఆలయ పెద్ద జీయర్ మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆరిపోలేదు. స్వామివారి కైంకర్యాలు ఆగమ శాస్త్ర పరంగా నిత్యం కొనసాగుతున్నాయని తెలిపారు.
జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు
తిరుమల వెంకన్నకు అర్చకులు నిత్యనైవేద్యాలు అందిస్తున్నామని, శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి అన్నారు. కాగా, శ్రీవారి దర్శనాలు రద్దుచేసి నేటికి పదిరోజులు కావడంతో తిరుమల నిర్మానుష్యంగా మారింది