Cyclone Mandous: శ్రీహరికోట వైపు దూసుకొస్తున్న మాండూస్ తుఫాన్, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం జగన్, నేడు అర్థరాత్రి కోస్తాంధ్ర, తమిళనాడుపై విరుచుకుపడే అవకాశం

ప్రభావిత జిల్లా కలెక్టర్లను (CM YS Jagan Directs Collectors) ఆదేశించారు. గురువారం తుపానుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.

Satellite picture of cyclone (Photo Credits: IMD)

Amaravati, Dec 8: ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న మాండూస్ తుపాను (Cyclone Mandous) పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభావిత జిల్లా కలెక్టర్లను (CM YS Jagan Directs Collectors) ఆదేశించారు. గురువారం తుపానుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు.

తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాస కేంద్ర తరలింపుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే రైతుల్లో కూడా ఈ తుపాను పట్ల అవగాహన కల్పించాలని, రైతు సహాయకారిగా ఉండాలని జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకుండా నిరోధించాలని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో.. పనిచేయాలని సీఎం జగన్‌ సూచించారు.

దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు, రేపు మహాబలిపురంలో తీరం దాటనున్న మాండూస్ తుపాను, ప్రస్తుతం తమిళనాడుకు వైపుకు దూసుకు వస్తున్న సైక్లోన్

ఈ తుఫాను గురువారం అర్ధరాత్రికి తీవ్ర రూపం దాల్చి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరి కరైకాల్‌కి దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుపాన్‌ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. ఈ ప్రభావంతో చెన్నైలో ఇప్పటికే వానలు మొదలు అయ్యాయి. చెన్నైలోని వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడు ఉత్తర భాగం గుండా తుపాన్‌ ప్రవేశిస్తుంది.

పుదుచ్చేరి, శుక్రవారం రాత్రి కల్లా ఏపీలోని దక్షిణ భాగం వైపు తీవ్ర ప్రభావం చూపెట్టనుంది. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా దూసుకు వస్తోంది.శుక్రవారం అర్ధరాత్రి పుదుచ్చేరి – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని పేర్కొంది.మహాబలిపురం వద్ద భూభాగంపై ప్రవేశిస్తుందని వివరించింది.

చిత్తూరు తీరం వైపు తుపాను, రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్షాలు, ఈ రోజు సాయంత్రం మాండూస్‌ తుపానుగా బలపడనున్న వాయుగుండం

తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అదే సమయంలో తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. వాతావరణ శాఖ మాత్రం ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తాంధ్రా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

రాత్రికి తుపానుగా మారే అవకాశమున్నందువల్ల తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, కోస్తా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. చెన్నైకి దక్షిణాన తుపాను తీరం దాటే అవకాశముందని, ఇందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, బుధవారం ఉదయం నుంచే బంగాళాఖాతం ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు గంటగంటకు వేగం పుంజుకుంటున్నాయని, ఈ నెల 10వ తేది వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం సూచించింది.