AP UG,PG Exams Update: ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కాలేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి

అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Andhra Education Minister Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల (10th Exams) మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు.

AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati, June 25: ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు (AP UG, PG Exams) రద్దయ్యాయని గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Andhra Education Minister Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల (10th Exams) మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. పెండిండ్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నాం, అత్యున్నత న్యాయస్థానానికి తెలిపిన సీబీఎస్ఈ బోర్డు, ప్రాక్టికల్ ప‌రీక్ష‌లు ఆధారంగా మార్క్‌లు

బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు. అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీలో తాజాగా 553 కరోనా కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,884 కు చేరిన కేసుల సంఖ్య, రికార్డుస్థాయిలో కోవిడ్-19 పరీక్షలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే తొమ్మిదో తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు. యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉందన్నారు.

పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.