Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?

ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

Duvvada Srinivas effect, every politician must learn the lession!(X)

Vij, Aug 11: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

ఇప్పుడు ఇదే దువ్వాడ పాలిట శాపంగా మారింది. రెండు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్‌ను ట్రోల్ చేస్తూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు 60 ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. ఛీ..ఛీ అని చీవాట్లు పెడుతున్నారు. ఇక తాను వాణికి ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానో స్వయంగా దువ్వాడ వివరణ ఇచ్చిన ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

భార్యకు విడాకులివ్వకుండా, వాళ్లను పట్టించుకోకుండా ఇలా మరో మహిళతో ఉండటం వివాహ వ్యవస్థకు కళంకమని ట్రోల్ చేస్తున్నారు. గతంలో హిందూ సంప్రదాయానికి తూట్లు పొడిసి ముగ్గురిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించిన దువ్వాడకు ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థమైందని కామెంట్ చేస్తున్నారు. బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

Here's Video:

పవన్‌ పై గతంలో దువ్వాడ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా ఇకనైనా రాజకీయాల్లో ఉన్న వారు హుందాగా ఆరోపణలు చేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నామని లేదా తమ పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది ఖచ్చితంగా తమ మెడకే చుట్టుకోవడం ఖాయం. గతంలో చాలా మంది రాజకీయ నాయకుల జీవితాల్లో ఇలాగే జరుగగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలోనూ అదే జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.