Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ డ్రామా, నాలుగో రోజు దువ్వాడ శ్రీనివాస్ ఆఫీస్‌ ముందు వాణి ఆందోళన, మాధురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మా నాన్న మాకు కావాలి అంటూ శ్రీనివాస్ కుమార్తెలు మీడియా ముందుకు రావడంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే రగులుతున్న విషయం కాస్త బయటకు వచ్చింది.

Duvvada Srinivas episode Police Case Filed on Divvala Madhuri Over Rash Driving(X)

Vij, Aug 12: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మా నాన్న మాకు కావాలి అంటూ శ్రీనివాస్ కుమార్తెలు మీడియా ముందుకు రావడంతో రెండు సంవత్సరాలుగా ఇంట్లోనే రగులుతున్న విషయం కాస్త బయటకు వచ్చింది.

ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటిపైకి వాణి, ఆమె కుమార్తెలు వెళ్లగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్. ఆ తర్వాత వాణికి విడాకులు ఇస్తానని ప్రకటించారు. దీంతో నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురి రోడ్ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో మాధురి కారు నుజ్జు నుజ్జు కాగా కావాలనే ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. అశ్రద్ధ, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించడంతో చట్టం ప్రకారం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదైంది. బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు

మరోవైపు నాలుగోరోజు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వాణి, ఆమె కుమార్తెలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మా నాన్న మాకు కావాలి అని చెబుతుండగా ఈ ఎపిసోడ్ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.