Election Code Effect For Tirumala Darshan: తిరుమల వెంకన్న దర్శనంపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్, ఇకపై సిఫారసు లేఖలు చెల్లవంటూ టీటీడీ ప్రకటన
శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్ వల్ల తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Tirumala, March 16: దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్ (Code) ఎఫెక్ట్ పడింది. శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్ వల్ల తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫారస్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధివిధానాల మేరకు శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని వెల్లడించారు.
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు ఏ రకమైన వసతి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబోమని పేర్కొన్నారు. భక్తులు, వీఐపీలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.