Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు, కరోనా నేపథ్యంలో సాదాసీదాగా మాజీ ముఖ్యమంత్రి బర్త్‌డే వేడుకలు, విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్, పలువురు రాజకీయ ప్రముఖులు
టీడీపీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అత్యంత సాదాసీదాగా ఈ వేడుకలు జరిగాయి. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు సోషల్ మీడియాలో (HBD CBN) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. చంద్రబాబు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. కాగా ట్విట్టర్ లో #HBDPeoplesLeaderCBN అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.
Hyderabad, April 20: టీడీపీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. అత్యంత సాదాసీదాగా ఈ వేడుకలు జరిగాయి. పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబుకు సోషల్ మీడియాలో (HBD CBN) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ సీఎంకు ప్రధాని ఫోన్, కరోనా నివారణ చర్యలపై చర్చ
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. చంద్రబాబు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. కాగా ట్విట్టర్ లో #HBDPeoplesLeaderCBN అంటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు చంద్రబాబుకి (Chandrababu Naidu Birth Day) సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండడంతో నేరుగా వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేయకుండా సోషల్ మీడియా ద్వారానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమ అధినేత పుట్టినరోజు 70వ వసంతంలోకి అడుగుపెట్టడంతో తెలుగు తమ్ముళ్లు స్పెషల్ వీడియోలతో బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Here's AP CM YS Jagan Tweet
చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో పాటు దేశ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఇక విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.
Here's TDP Leaders Tweets
చంద్రబాబుకు సినీ నటుడు దగ్గుబాటి రానా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు ఒకప్పటి చంద్రబాబు ఫొటోను షేర్ చేశారు. అంతేకాక, నందమూరి బాలకృష్ణ చిత్రం 'ఎన్టీఆర్'లో తాను పోషించిన చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఫొటోను కూడా జతచేశారు. 'హ్యాపీ బర్త్ డే సర్. మీ పాత్రను పోషించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
Here's Rana Daggubati Tweet
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మనవడు నారా దేవాన్ష్ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపాడు. ‘ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన తాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Here's Brahmani Nara Tweet
మీరు నన్ను ప్రేమించటం ఎంతో “గొప్ప” విషయం. నాకు మీరు ఓ ఐకాన్, ప్రేరణ. ముఖ్యంగా మీరే నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ ట్వీట్ చేశారు. దేవాన్ష్ తరపున బ్రాహ్మణి తన ట్విట్టర్ ఖాతాలోఈ పోస్టు చేశారు. తాతా మనవడు కలిసి దిగిన ఓఫోటోను కూడా ఆమె షేర్ చేశారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా కూడా మెగాస్టార్ ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను.
Here's Chiranjeevi Konidela Tweet
విషింగ్ యూ ఏ హ్యాపీ 70th బర్త్ డే సార్, మీ విజన్, మీ హార్డ్ వర్క్, మీ అంకితభావం ఎంతో గొప్పవి ’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు గతంలో చంద్రబాబుతో సరదాగా దిగిన ఒక ఫోటోను కూడా చిరు షేర్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)