Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు.

Ex Minister Reddi Satyanarayana (Credits: X)

Vijayawada, Nov 5: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) (Ex Minister Reddi Satyanarayana Passed Away) కన్నుమూశారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో  ఆయన గత కొన్నిరోజులుగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం పెదగోగాడలోని నివాసంలో ఆయన కన్నుమూశారు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం (Assembly) నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రికార్డు ఆయన సొంతం. తొలిసారిగా 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేతల్లో ఆయన ఒకరు.

కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన ప్రధాని మోదీ, ఈ దాడి భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని మండిపాటు

వివిధ హోదాల్లో సేవలు

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు టికెట్‌ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున నాలుగుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేబినెట్‌ లో పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా, అసెంబ్లీలో అంచనాల కమిటీ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. రెడ్డి సత్యనారాయణ మృతిపై పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

కెనడాలో హిందూ ఆలయంపై దాడిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, అన్ని ప్రార్థనా స్థలాలకు తగిన​ంత రక్షణ ఉండేలా చూడాలని జస్టిన్‌ ట్రూడోకు పిలుపు