AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, పలు పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Air Circulation In Bay Of Bengal) తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vijayawada, NOV 16: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా (Air Circulation In Bay Of Bengal) మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Air Circulation In Bay Of Bengal) తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. గడచిన ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తీవ్ర వాయుగుండం రేపు పశ్చిమ బెంగాల్ తీరం, మోన్గ్లా ఖేపురా మధ్య తీరం దాటే ఆవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చాల చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది.

Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే?? 

తీరం వెంబడి గాలులు 45-55 కిలోమీటర్ల వేగంతో వీచే ఆవకాశం ఉంది. మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.