Flood Disaster Loss in AP: ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం మిగిల్చిన నష్టంపై నివేదిక సిద్ధం, ఏయే శాఖకు ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి వివరాలు రెడీ చేసిన ప్రభుత్వం
సుమారు రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది.
Vijayawada, SEP 07: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కురిసిన భారీ వర్షం, వరద విపత్తు (Flood disaster) వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని రాష్ట్రప్రభుత్వం (Government) వెల్లడించింది. సుమారు రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది. ఆర్‌అండ్‌బీ(Roads and Buildings) కి రూ. 1,164.5 కోట్లు, నీటివనరులశాఖకు (Irrigations) 1568.5 కోట్ల నష్టం, పురపాలకశాఖకు (Municipality) 1,160 కోట్లు, రెవెన్యూశాఖకు రూ. 750 కోట్లు నష్టం వాటిళ్లిందని అధికారులు నివేదికలు తయారు చేశారు.
విద్యుత్ శాఖకు రూ. 481 కోట్లు, వ్యవసాయశాఖకు రూ. 301 కోట్ల నష్టం జరిగిందని , పంచాయతీ రోడ్లకు రూ. 167.5 కోట్లు, మత్స్యశాఖకు రూ. 157.86 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం నివేదికను రూపొందించింది. గ్రామీణ నీటిసరఫరాకు రూ. 75.5 కోట్లు, ఉద్యానశాఖకు రూ.39.9 కోట్లు, పశు సంవర్ధకశాఖకు రూ.11.5 కోట్లు, అగ్నిమాపకశాఖకు రూ. 2 కోట్లు నష్టం జరిగిందని ఏపీ సర్కార్ నివేదికను సిద్ధం చేసింది.