Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

Vijayawada Budameru River Flood is increasing again (photo/Video grab/BigTV)

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవలి వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది.

 కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు

తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు, బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత నాలుగు రోజుల పాటు తిండి, నీరు లేక అవస్థ పడిన జనం.. మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.