Devineni Uma: రాజమండ్రి జైలుకు దేవినేని ఉమ, 14 రోజులు రిమాండ్ విధించిన మైలవరం జడ్జి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, వైసీపీ నేతపై దాడి చేశారని ఆరోపణలు
దేవినేని ఉమకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ (Devineni Uma remanded for 14 days) విధించారు. రాజమహేంద్రవరం జైలుకు (Rajahmundry jail) తరలించాలని మైలవరం జడ్జి షేక్ షేరిన్ ఆదేశించారు.
Amaravati, july 28: కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును (Former TDP minister Devineni Uma) హనుమాన్ జంక్షన్ తరలించారు. హనుమాన్ జంక్షన్ సీఐ ఆఫీసులో జూమ్ యాప్ ద్వారా వర్చువల్‌గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను (Devineni Uma Maheshwararao ) హాజరుపర్చారు. దేవినేని ఉమకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ (Devineni Uma remanded for 14 days) విధించారు. రాజమహేంద్రవరం జైలుకు (Rajahmundry jail) తరలించాలని మైలవరం జడ్జి షేక్ షేరిన్ ఆదేశించారు.
కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ఏపీ ప్రభుత్వం (AP Govt) పేదలకు ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ కార్యకర్తలతో వచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ మంత్రి ఉమతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ఉమ తనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమా అక్రమ మైనింగ్ చేశాడని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జి.కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట దాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఉమ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఉమాను అరెస్టు చేసిన తర్వాత ఉదయం 6గంటలకు నందివాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటినుంచి నందివాడలో హై అలర్ట్ ప్రకటించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దేవినేని ఉమాతో స్టేషన్ నుంచి బయలుదేరిన పోలీస్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెదేపా శ్రేణులు అడుగడుగునా ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య దేవినేని ఉమాను కోర్టుకు తరలించారు
దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతకుముందు భారీ భద్రత మధ్య మాజీ మంత్రి దేవినేని ఉమను మైలవరం కోర్టుకు తరలించారు. ఉమను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు.