Ex-Telangana CS Somesh Kumar: మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ, దరఖాస్తును జగన్ ఆమోదించినట్టుగా వార్తలు, కారణం ఇదేనా..
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (Ex-Telangana CS Somesh Kumar) స్వచ్ఛంద పదవీవిరమణ (Somesh Kumar Taken voluntary retirement) చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (Ex-Telangana CS Somesh Kumar) స్వచ్ఛంద పదవీవిరమణ (Somesh Kumar Taken voluntary retirement) చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్ ఆమోదించినట్టు సమాచారం. సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి శాంతికుమారిని కొత్త సీఎస్‌గా నియమించింది.
హైకోర్టు ఆదేశాలతో జనవరి 12న అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసిన సోమేశ్ కుమార్ ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు, ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పోస్టు కేటాయించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ఆయన ఈ మేరకు దరఖాస్తు పెట్టుకోగా.. ఆయన దరఖాస్తును ముఖ్యమంత్రి జగన్ ఆమోదించినట్టు తెలుస్తోంది.