AP Sankranti Holidays: జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ ఏపీలో సంక్రాంతి సెలవులు.. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి

ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉండటం ఆనవాయితీ.

Chandrababu in Assembly (photo-Video Grab)

Vijayawada, Dec 28: ఏపీవాసులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti). ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సంక్రాంతి పండుగ సెలవులకు (AP Sankranti Holidays) స్వగ్రామాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో ఆనందోత్సాహాలతో గడుపుతూ ఉండటం ఆనవాయితీ. అందుకే సంక్రాంతి సెలవులకు ఏపీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ పండుగకే విద్యార్ధులకు స్కూల్స్ ఎక్కువ రోజులు సెలవులు కూడా ఇస్తాయి.  అయితే ఈ ఏడాది సంక్రాంతి సెలవులపై సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.

సంక్రాంతి ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఏపీకి 5 వేల బస్సులు

సోషల్ మీడియాలో ఏ ప్రచారం అంటే?

వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటించినందున ఈ సారి 11వ తేదీ నుంచి 15 వరకు, లేదా 12 నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని కృష్ణారెడ్డి తెలిపారు.

నేటి ఉదయం.11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. నిగమ్‌ బోధ్ ఘాట్‌ లో అంతిమ సంస్కారాలు (లైవ్)